27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మాకేమి భయము


మారాము డున్నాడు మాకేమి భయము

శ్రీరాము డున్నాడు సిధ్ధము జయము


మునినాథులు మెచ్చుకున్న జననాథుండైన

జననాథుల కులములోన సర్వోత్తముడైన


సునిశితబాణంబు లున్న మొనగాడై యున్న

మొనల రేగి దనుజుల నాశనము చేసి యున్న


భక్తవరుల కందరకును ముక్తి నిచ్చు చున్న

ముక్తి దక్క వేడని మమ్మొప్పుగ రక్షించే

2 కామెంట్‌లు:

  1. మత్త కోకిల అని మీరు చెబితే మత్తు కోక్ అని జిలేబి మార్చింది. ఆ వెకిలి స్వభావం ఇక మారదు .

    శర్మ గారికి జిలేబీ వెర్రి వ్యాఖ్యలు ఇష్టమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హద్దుల్లో ఉంటేనే
      ముద్దన్నది తెలియలేని మొద్దుజిలేబీ
      వద్దంటే వింటుందా
      వద్దిక తనతోడ మనకు వాదాలేలా

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు