10, ఫిబ్రవరి 2026, మంగళవారం

అనవే మనసా యికనైన

అనవే హరి శరణం బనవే
అనవే మనసా యికనైన

హరి పురుషోత్తమ రామా శరణం
  బనవే మనసా యికనైన
హరి సంసారభ్రమ నిదిగో విడచితి
  ననవే మనసా యికనైన
హరి శ్రీకరమగు నీదయయే చా
  లనవే మనసా యికనైన
హరి భవతారక నీనామము చా
  లనవే మనసా యికనైన

హరి నీసచ్చరితామృతమే హిత
  మనవే మనసా యికనైన
హరి నీపాదాబ్జంబుల నుండెద
  ననవే మనసా యికనైన
హరి యతనుని స్నేహంబును వదలితి
  ననవే మనసా యికనైన
హరి యేపుణ్యము పాపంబును వ
  ద్దనవే మనసా యికనైన

హరి నీవే గతి నీవే గతి నా
  కనవే మనసా యికనైన
హరి నీసద్భక్తులె నాదేశికు
  లనవే మనసా యికనైన
హరి నిను నమ్మితి నిన్నే నమ్మితి
  ననవే మనసా యికనైన
హరి యీ యెత్తిన జన్మంబులు చా
  లనవే మనసా యికనైన


6 కామెంట్‌లు:

  1. "హరి యతననుని స్నేహంబును వదలితి"
    అర్ధం కాలేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. forced to type on mobile due to bed resting. sorry for the typo which stands corrected now.

      తొలగించండి
    2. "హరి యతనుని స్నేహంబును వదలితి"
      అదేమో అర్ధం కాలేదు,వీలు చూసుకుని/వీలు చేసుకుని చెప్పండి కంగారేం లేదు.🙏 😂

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు