అనవే హరి శరణం బనవే
అనవే మనసా యికనైన
బనవే మనసా యికనైన
హరి సంసారభ్రమ నిదిగో విడచితి
ననవే మనసా యికనైన
హరి శ్రీకరమగు నీదయయే చా
లనవే మనసా యికనైన
హరి భవతారక నీనామము చా
లనవే మనసా యికనైన
హరి నీసచ్చరితామృతమే హిత
మనవే మనసా యికనైన
హరి నీపాదాబ్జంబుల నుండెద
ననవే మనసా యికనైన
హరి యతనుని స్నేహంబును వదలితి
ననవే మనసా యికనైన
హరి యేపుణ్యము పాపంబును వ
ద్దనవే మనసా యికనైన
హరి నీవే గతి నీవే గతి నా
కనవే మనసా యికనైన
హరి నీసద్భక్తులె నాదేశికు
లనవే మనసా యికనైన
హరి నిను నమ్మితి నిన్నే నమ్మితి
ననవే మనసా యికనైన
హరి యీ యెత్తిన జన్మంబులు చా
లనవే మనసా యికనైన
"హరి యతననుని స్నేహంబును వదలితి"
రిప్లయితొలగించండిఅర్ధం కాలేదు
forced to type on mobile due to bed resting. sorry for the typo which stands corrected now.
తొలగించండి"హరి యతనుని స్నేహంబును వదలితి"
తొలగించండిఅదేమో అర్ధం కాలేదు,వీలు చూసుకుని/వీలు చేసుకుని చెప్పండి కంగారేం లేదు.🙏 😂
అతనుడు అనగా మన్మథుడు.
తొలగించండిWhat happened.
రిప్లయితొలగించండిStill confused
విడిగా ఈవిషయం వ్రాసానండి. Thanks for your concern.
తొలగించండి