సూర్యసుతుడు గిరిని డాయు చున్న వారి నిర్వురన్
సూర్యకులవివర్ధను ల్విశుధ్ధయశులగాంచి దు
ర్వార్యు లన్న వాలి బంప వచ్చినార టంచు గాం
భీర్య ముడిగి పవనసుతుని వేగు బంపె నంతటన్ 229
రవికులోత్తమునకు ప్రీతి రవిసుతునకు మైత్రి నా
పవనసుతుడు గూర్చె పిదప వాలి నొక్క కోల తో
భువిని గూలనేసి రామభూవరుండు రాజుగా
మివుల కూర్మి మీర నిల్పె మిత్రు గీశ భూమికిన్ 230
వానకారు గడపి మాల్యవంత గిరిని రాము డా
వానరేశు పనిచె వేగపడగ సీత జాడ నె
ట్లేని వెదుక నపుడు గొప్ప ఠేవగల్గు వీరులన్
వానరోత్తములను రాజు బంపె నాల్గు దిశలకున్ 231
హనుమ నపుడు బిల్చి ఇచ్చె నంగుళీయకంబు నో
యనఘ యవనిజాత జాడ లరయగలవు నీవు నా
మనసు బల్కు నినకులంపు మనికి నిల్పు వాడ వై
జనుమ టంచు ప్రియము లాడి స్వామి రామచంద్రుడున్ 232