కోరుదు నీదయామృతము గోవిందుడా నా
కోరిక నెరవేర్చ వయ్య శ్రీరాముడా
కోరనుగా వాహనములు గోవిందుడా నేను
కోరనుగా భూము లిండ్లు గోవిందుడా
కోరనుగా బలగంబులు గోవిందుడా నేను
కోరనుగా సిరు లేవియు గోవిందుడా
కోరనుగా దొరతనములు గోవిందుడా నేను
కోరను మృష్టాన్నములను గోవిందుడా
కోరనుగా దేహబలము గోవిందుడా నేను
కోరనుగా దీర్ఘాయువు గోవిందుడా
కోరనుగా పరుల మెప్పు గోవిందుడా నేను
కోరనుగా కీర్తి గీర్తి గోవిందుడా
కోరనుగా యేమహిమలు గోవిందుడా నేను
కోరనుగా మరల జన్మ గోవిందుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.