ఏమని శ్రీరఘురాముని మరచితి
వేమని పలుమరు లీమహి బుట్టితి
వేమని తనువుల నింతగ నమ్మితి
వేమని సిరులకు నిటునటు తిరిగితి
వేమని యెఱిగియు హీనుల గొలిచితి
వేమని తప్పుల నెఱుగక పోతివి
వేమని యితరుల నేడ్పించితివి
వేమని పాపము లింతగ జేసితి
వేమని పెద్దల నెన్నక పోయితి
వేమని గురువుల నెదురు వచించితి
వేమని సుజనుల నేర్చుచు తిరిగితి
వేమని కుజనుల హెచ్చుగ జేరితి
వేమని ఖలులను హితులని భ్రమసితి
వేమని ధనముల నింతగ నమ్మితి
వేమని భోగము లింతగ గోరితి
వేమని ప్రాయము నెంతో నమ్మితి
వేమని సుఖముల నెప్పుడు గోరితి
వేమని సంసారేఛ్ఛను విడువవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.