18, నవంబర్ 2026, బుధవారం

వేడుకతో నిన్ను గూర్చి పాడుచున్నాము

 
వేడుకతో నిన్ను గూర్చి పాడుచున్నాము మేము
నాడు నేడు రేపు మాకు నమ్మకముగ నిదే పని

గుణములన్ని నీయందే గూళ్ళు కట్టు కొన్నవి
రణములన్ని జయమునీది రామా యనుచున్నవి

భయములన్ని నిన్ను చూచి పారిపోవుచున్నవి
జయములన్ని నీయెదట సాగిలపడుచున్నవి

మునులందరు నిన్నుచేరి మోహించుచు నున్నారు
జనులందరు నీనామమె జపము చేయుచున్నారు

దయతో రామణదైత్యుని దండించితి వీవనుచు
స్వయముగ దేవతలు నీకు సాగిల పడుచున్నారు

సవనంబులు నీరక్షణ చక్కగ గనుచునచనవి
భువనంబులు నీరక్షణ పొంది మనుచునున్నవి

పవమానాత్మజుడు నిన్ను ప్రస్తుతించు చున్నాడు
భవచక్రము నీదయచే బదాబద లగుచున్నది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.