విమలశుధ్ధబ్రహ్మ మగుచు వెలుగొందు రామునకు
సమర్పించితిని నేడు సమర్పించితి
సర్వేశ్వరుడైన హరికి సర్వాత్మనా నాదు
సర్వకర్మఫలంబులను సమర్పించితి
గర్వాదిక దోషములను కలిగించు నహమికకు
గర్వముడిపి శ్రీహరికిదె కాన్క చేసితి
సర్వపూర్వజన్మంబుల సాధించిన జ్ఞానమును
సర్వేశ్వరుడైన హరికి సమర్పించితి
పూర్వకర్మఫల భోగమున కైన దేహమను
సర్వేంద్రియశాఖి నిదే సమర్పించితి
అమర హరి చాయను జీవమును రామపాద
కమలంబుల కడ నేను సమర్పించితి
సుమశరుని తండ్రి కాత్మశుధ్ధిగ నన్నేను
నమస్కారపూర్వకమున సమర్పించితి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.