రామయ్యా కోమలహృదయా
నామొరలను వినవయ్యా
అతిదుర్మార్గుడ నేనయ్యా
అతిసుశీలుడ వీవయ్యా
పతితజీవుడ నేనయ్యా
పతివందరకు నీవయ్యా
నరమాత్రుడను నేనయ్యా
పరమాత్ముడవు నీవయ్యా
శరణాగతుడ నేనయ్యా
పరమోదారుడ వీవయ్యా
భయశీలుడను నేనయ్యా
జయశీలుడవు నీవయ్యా
దయామయుడవు రామయ్యా
రయమున గావ రావయ్యా