ఉ. రాముని పైన పద్యములు వ్రాయుట కంటెను భాగ్యమున్నదే యామని వేళ పద్యముల నల్లుట కంటెను భాగ్యమున్నదే యేమని చెప్పవచ్చు హృదయేశ్వరు డైన మహాత్ముడా పరం ధాముని పైన పద్యము లుదారత నామని జెప్పు భాగ్యమున్ |
తే.గీ. చైత్రశుధ్ధపాడ్యమి నాడు చిన్మయుండు భూమిజాయుక్తు డైనట్టి రామచంద్ర మూర్తి పట్టాభిషిక్తుడై పుడమి నేలె పరమధర్మావతారుడా భద్రమూర్తి |
సీ. శ్రీరామపట్టాభిషేకమహోత్సవ పర్వదిన ముగాది పర్వదినము ప్రభువాయె నుగాది భద్రదినంబున ధర్మాత్ముడైనట్టి ధర్మరాజు విఖ్యాతికెక్కిన విక్రామాదిత్యుడు గద్దె కెక్కిన దుగాది ఘనదినంబె పట్టాభిషిక్తుడై ప్రభువాయె నుగాది దినమున శాతవాహనుడు గూడ |
తే.గీసర్వవిధముల సకలరాజన్యసేవ్య మానమై నవ్యవాసంతమహితశోభ నెల్లవారల హృదయమ్ము లుల్లసిల్ల నరుగుదెంచె విలంబి యుగాది యిపుడు |
తే. రామచంద్రుని సత్కృపాప్రాప్తి గలిగి సకలసౌఖ్యములను గూర్చజాలు గాక ఈ విలంబి యనెడు పేర నెసగు నట్టి కొత్తసంవత్సరము మన చిత్తములకు |
తే. రాము డేలెడి భూమిలో రాజకీయ పక్షులాడెడి యాటలు పాడుగాను ఆంధ్రజనులకు సంతోష మతిశయించ ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక ( చందానగర్ లో జరిగిన నేటి కవిసమ్మేళనంలో ఈపద్యాలను చదవటం జరిగింది.) |
17, మార్చి 2018, శనివారం
ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)