7, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీరఘురాము పాద


ఉ. శ్రీరఘురాము పాదసరసీరుహయుగ్మము నాశ్రయించి సీ
తారమణీలలామ జగదంబగ  మిక్కిలి వాసిగాంచె సా
మీరి చిరాయువై నెగడు మీదట బ్రహ్మపదంబు నొందు సొం
పారవిభీషణుండు నొడయండుగ నాయెను శాశ్వతంబుగన్ 

(వ్రాసిన తేదీ: 2013-1-14)