2, ఫిబ్రవరి 2013, శనివారం

కుదురుగ పట్టెదేని


చం. కుదురుగ పట్టెదేని బహుకోమలరామపదాబ్జయుగ్మమున్
చదువగ నేర్తువేని మనసా రఘురాముని దివ్యగాధ నిం
పొదవగ పాడెదేని రఘుభూవరుదివ్యయశోవిలాసమున్
సదమల మోక్షలక్ష్మి మరి చక్కగ రాము డనుగ్రహించెడున్

(వ్రాసిన తేదీ: 2013-1-12)