రామచంద్ర మహారా జేమడిగిన మన కిచ్చును
ఆ మహారాజు నడుగ నామోక్షమును వచ్చును
రామచంద్ర మహరాజు రాజ్యములో నున్నాము
ఆ మహారాజు కరుణ ననుభవించు చున్నాము
ఆ మహారాజు వలన హాయిగ మనమున్నాము
ఆ మహారాజు దైవ మని తలచుచు నున్నాము
రామచంద్ర మహరాజు రక్షణలో నున్నాము
ఆ మహారాజు మావాడని పలుకుచు నున్నాము
ఆ మహారాజు గొప్పయశము చాటుతున్నారు
ఆ మహారాజు దైవమని తలచుచు నున్నాము
రామచంద్ర మహరాజు కతిభక్తుల మైనాము
ఆ మహారాజు ప్రేమ అనుభవించు తున్నాము
ఆ మహారాజు కన్న నన్యమెరుగ కున్నాము
ఆ మహారాజు దైవమని తలచుచు నున్నాము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.