హరినామము చాలు కదా హరేరామ హరేరామ
హరికృపయే చాలు కదా హరేకృష్ణ హరేకృష్ణ
హరికృపయే బడసినచో ఆపదలే లేవు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
హరిసేవయె దొరకినచో ఆనందము కలుగు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
హరితత్త్వము నెరుగుటలో ఆనందము వేరు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
హరిభక్తులు కలసినచో ఆనందము పొంగు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
హరిసన్నిధి నిలచుటలో ఆనందముప్పొంగు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
హరిచేరగ బిలచినచో అవల పుట్టువు లేదు కదా
హరేరామ హరేరామ హరేకృష్ణ హరేకృష్ణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.