10, జులై 2026, శుక్రవారం

కలగిన వేళల హరినామం

 
కలగిన వేళల హరినామం మన
సలసిన వేళల హరినామం

తెలియని చోటుల తెలియని మనుషుల
వలన చిక్కులగు పట్టున నొకచో
తెలిసీతెలియక తిరుగగ నగుచో
తెలివిడి కొరకై దేవుని నామం

నిలకడ చెదిరిన నిందలు కలిగిన
తొలగిన తనవారలె కోపముతో
బలవంతులు తనపై పగబట్టిన
వలసిన బలమా భగవన్నామం

హరేరామ యని హరేకృష్ణ యని
పరమాదరమున పలుకుచు నున్నను
తరచుగ నిష్ఠకు తప్పగ నీయని
వరసాధనమును హరినామంబే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.