పూజించిన శ్రీహరినే పూజింపుము నీవన్యుల
పూజించిన సత్ఫలములు పుట్టుట కలదా
శివుని శంకరుని హరుని సేవింతును నేనంటే
శివుని శ్రీహరియు సతము సేవించు గద యంటే
భవహరు డాశివు డొకడే వల దన్యుల జోలంటే
శివునే పూజింపుమా శ్రీహరియే శివుడు
శ్రీమాతను లలితాంబను సేవింతును నేనంటే
కామితార్ధప్రదాయిని కదా శ్రీదేవి యంటే
ఆమెను భవతారిణినే ఆరాథించెద నంటే
రాముడే లలితమ్మ భేదమేమి పూజింపుము
రాముడు లలితాంబ రాజశ్యామల శ్రీకృష్ణుడు
రాముడు నారాయణుండు రాముడే శివుడు
ఏమేమో పేర్లు పెట్టి యెవనిగా నెంచిన
ప్రేమతో నాపూజలు శ్రీహరికే చెందును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.