6, జులై 2026, సోమవారం

ధీరం కరుణాపారావారం


ధీరం కరుణాపారావారం 
  దూరీకృతసంసారం
కారణకారణ మనిశం వందే  
  శౌరిం సర్వశుభాకారం

శతశతమారాకారం కృష్ణం
  జయజయ నందకిశోరం
ధృతగోవర్ధనశైలం కృష్ణం 
  దైత్యానేకవిదారం

శతక్రతుమదసంహారం కృష్ణం 
  ధృతగోవింద సునామం
ధృతగోగోపకరూపానేకం
  చతురానన బహువినుతం

లోపవిరహిత మనంతం కృష్ణం
   దీపిత యాదవవంశం
శ్రీపతి మతిమతిమంతం కృష్ణం
   తాపత్రయవిధ్వంసం

గోపీమానసచోరం కృష్ణం
  తాపసజనమందారం
పాపారణ్యదవాగ్నిం కృష్ణం 
  రూపితవిష్ణుస్వరూపం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.