అక్కరయే లేనివెన్నొ మిక్కిలిగా పలికేవు
దిక్కుమాలిన నాలుకా దేవుని పిలిచేవా
కొందరిని నీవేమో కొసరికొసరి పిలిచేవు
కొందరిని పలుకరించ కుతూహలము చూపేవు
అందరితో నిచ్చకము లాడుచునే తిరిగేవు
ఎందుకే హరిని పలుకరించుటే మరచేవు
కొందరిని గూర్చి బలే గొప్పగా పొగిడేవు
కొందరిని పొగడుటకై కుతూహలము చూపేవు
కొందరిని ప్రతిఫలమును కోరి నీవు పొగిడేవు
ఎందుకే హరియశంబు నించుకయు పొగడవు
హరేరామ యని పలుకుట యంతచేదా యేమి
హరేకృష్ణ యనగ మధురమని తోచదా యేమి
హరినామము విడచి నీవక్కరలేని వన్నియును
తరచుగా వదరేవు తప్పెరుగని ఓరసనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.