31, జనవరి 2026, శనివారం

నీదే భారము


నీటముంచుము పాలముంచుము నీదేభారము
నేటి దుస్థితి నాటి నాస్థితి నీదయే ప్రభూ

అవనినుండగా నాజ్ఞచేసినా వట్లుచేసితి

పవలురాత్రులు రామ నీకునై పాడుచుంటిని

వివిధదేహముల్ దాల్చుచుంటిని వీరరాఘవ

భువనపాలన మరల స్వస్థితిన్ పొందు టెప్పుడో


నిరుపమానమౌ నీదు కరుణనే నేను నమ్మితి

పరమపావన వరప్రదాయక పతితపావన

మరల స్వస్థితిన్ పొందు వరము నిమ్మందురా ప్రభూ

శరణు శరణు నా మొరలు వినవయా స్వామి నీవికన్

 

4 కామెంట్‌లు:

  1. చిన్న టైపోలు సరి దిద్దండి.
    భువనలాలన్,పతితపావన న,త ల బదులు ప పడింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మోబైల్ మీద టైపింగు వలన టైపోలు పడుతున్నాయండి. సరిచేసాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఏమా స్వస్థితి? వివరించుడీ🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వస్థితి అంటే ఒకప్పుడు ఉండిన నా అసలైన స్థితి. దానిని వివరించటం కష్టం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు