21, ఫిబ్రవరి 2019, గురువారం
జనకుడా హరి నీకు జామాతగా దొరకె
జనకుడా హరి నీకు జామాతగా దొరకె
అనఘా యీ సీతయే యాదిలక్ష్మి గాన
దేవతల సంకల్పము తెలియుట దుస్సాధ్యము
దేవరాతునింట శివుని దివ్యధనువు నుంచిరి
భావింపగ నావింటిని పట్టి యెత్త హరు డొండె
శ్రీవిభు డొండె నరుల చేత నేమగునయ్య
యజ్ఞాంగుడు శ్రీనాథు డవతరించ రాముడై
యజ్ఞకర్మస్వరూపిణియె యవతరించి సీతగ
యజ్ఞవాటి సముత్థితగ నబ్బెను నీ చేతికి
యజ్ఞేశానికి పతి యజ్ఞపతియే సుమా
నీ తనయగ నెగడు సీత నిజము లోకమాత
సీతాపతి శ్రీరాముడు చిన్మయుడగు విష్ణువు
సీతారాములకు పెండ్లి చేయుట నీ సుకృతము
సీతారాములకు సేవ చేయుట మా సుకృతము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సార్ మీరు గణపతి ,శివుడు, పార్వతి అమ్మవారు, కృష్ణుడు దేవుళ్లపైన కూడా కొన్ని పాటలు వ్రాస్తే బాగుంటుంది. అలాగే కొన్ని సంస్కృత గీతాలు కూడా శ్యామ మకుటంతో వ్రాయండి.
రిప్లయితొలగించండిమీ అభిమానానికి ధన్యవాదాలు. సందర్భానుసారం అప్పుడప్పుడు అవీ వెలువడుతూ ఉంటాయి. ఉదాహరణకు అమ్మవారిపై కొన్ని కీర్తనలు ఇప్పటికే వచ్చినవి.
తొలగించండి