దనుజులపాలి కోదండరాముడు భక్త జనకోటిపాలిటి జానకీరాముడు |
|
కరుణాళువు వీడు లోకకళ్యాణరాముడు సురగణంబులకు సర్వశుభదరాముడు అరయగా దశరథున కానందరాముడు మురియు కౌసల్య కేమొ ముద్దులరాముడు |
దనుజుల |
మునిపత్నిపాలి శాపమోచనరాముడు మునికోటులకు వీడు మోక్షదరాముడు జనకరాజునకు వీడు జామాత రాముడు జనకాత్మజామనస్సరసీరుహధాముడు |
దనుజుల |
సామాన్యులము మాకు సకలవరదరాముడు కామాదిదుష్టవైరిఖండనరాముడు పామరత్వమణచు నట్టి బంగారురాముడు రామరాజ్యస్థాపకుడు రాజారాముడు |
దనుజుల |
27, సెప్టెంబర్ 2016, మంగళవారం
దనుజులపాలి కోదండరాముడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.