తెలిసికొన్న కొలది తత్త్వము తెలియలేమియె తెల్లమగురా । అది తెలియవశము కాదు రామదేవునింక శరణువేడర |
|
వయసు మీఱుటచేత మీదికి వచ్చిపడిన ప్రభుతవలన దయను జూపుచు పెద్దవారు తత్త్వబోధలు చేయుచుందురు భయము నయము వినయమొప్ప వాదులాడక వినెద వీవు పయిడి పలుకుల తత్త్వమాధురి భావవీధుల నిలువకుండును |
తెలిసి |
కొంత పెద్దలవద్ద నేరిచి కొంత గురువుల వద్ద నేరిచి కొంతతెలిసి కౌతుకముతో కోరి గ్రంథము లరయ బోతే యెంతచదివిన కాని తత్త్వచింతనము సిధ్ధించకుండును సుంతలాభము లేక చిత్తక్షోభయే తరచగుచునుండును |
తెలిసి |
ఘనముగా బోధించు వారు కాంచినదియు స్వల్పమేనా ఘనతకెక్కిన గ్రంథరాశిని మనకుదొరకున దల్పమేనా యనుచు నంతవిచార పడబో కసలు తత్త్వము రామతత్త్వమె మనసు రామార్పణము చేసిన మంచిగా తత్త్వమ్ము తెలియును |
తెలిసి |
29, సెప్టెంబర్ 2016, గురువారం
తెలిసికొన్న కొలది తత్త్వము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.