శ్రీరామ శ్రీరామ యనగానే చింతలన్నీ దూరమయ్యేను నోరార శ్రీరామ యనగానే కోరదగినది చేరువయ్యేను |
|
నోరూరగా కాచి యెన్నెన్నో భూరుహంబున పండ్లు గమనించ మూరెడెత్తున నూగుచుండంగ మోజుపడియును నందుకోలేడు చేరి చెట్టు క్రింద మరుగుజ్జు చెట్టు దేముండును దోసమ్ము శ్రీరామ యనలేక మూర్ఖుండు శ్రీరామకృప నందుకోలేడు |
శ్రీరామ |
నిండు పున్నమరేయి జాబిల్లి పండువెన్నెల కాయుచుండంగ బండనిద్దురవచ్చి రేయెల్ల పండు కొన్నాడా ముసుగెట్టి ఉండియూ ఊడియూ గగనాన ఒక్కటే కద చందమామయ్య తిండి నిద్దుర బ్రతుకు శ్రీరామదేవునికృప నందుకోలేదు |
శ్రీరామ |
పిలచి పెండ్లివిందు భోజనము పెట్టగ పదిమంది తినుచుండ కెలకుచుండు గాని జ్వరరోగి వలన కాకుండును భుజియింప వలచి సిద్ధాన్నంబు తినలేని వాని వంటివాడు నాస్తికుడు తలచి శ్రీరామ యనలేడో తాను రామకృప గొనలేడు |
శ్రీరామ |
28, సెప్టెంబర్ 2016, బుధవారం
శ్రీరామ శ్రీరామ యనగానే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ కీర్తనకు ఒక నేపథ్యం ఉంది. కొన్నాళ్ళుగా రోజునకు ఒకటికి బదులుగా రెండు చొప్పున కీర్తనలు వెలువడితే బాగుండునన్న భావన కలిగింది. ఎప్పుడన్నది రాముడు చెప్పలేదు కాబట్టి తెలియలేదు. ఎప్పుడా అని చూస్తున్నాను. నిన్న రాత్రి పదునొకండు గంటల తరువాత వ్రాసినది వరుసలో ఎనిమిదవ తారిఖునకు ఉంచవలసి ఉండగా తమాషాగా అచ్చులోనికి వెళ్ళిపోయింది. ఉదయమే కాని గమనించలేదు. ఇదీ బాగానే ఉంది. ఏది జరిగిన నది యీతని యానతి యేది వలదను నది యెన్నడు కానిది! అంతే అంతే.
రిప్లయితొలగించండికొన్ని అసంకల్పితంగా జరుగుతాయి, మన ప్రమేయం ఉండదు,అంతే, ఈశ్వర సంకల్పం
రిప్లయితొలగించండి