13, సెప్టెంబర్ 2016, మంగళవారం

రామభక్తిమార్గమే రాజమార్గము



రామభక్తిమార్గమే రాజమార్గము ఈ
భూమి నెల్లవారలకును ముక్తిమార్గము

కాముకులు కలనైన కాంచరాని మార్గము
తామసులు బుధ్ధిలోన తలపబోని మార్గము
పామరత్వమును వీడి పరమాత్ము నెన్నెడు
రామభక్తులందరకును రమ్యమైన మార్గము
రామభక్తి

మొద్దులైన వారికెపుడు బుధ్ధిపోని మార్గము
పెద్దలెన్నుకొన్న గొప్ప పేరుపడ్డ మార్గము
హద్దులేనిసంతోషపు హర్మ్యమునకు మార్గము
రద్దీగా నుండనిదిది రామభక్తిమార్గము
రామభక్తి

లజ్జుగుజ్జులాడువారు లక్షించని మార్గము
ఒజ్జలైనవారు చెప్పు నుచితమైన మార్గము
ముజ్జగముల వారికిదే ముఖ్యమైన మార్గము
సజ్జనులగు రామభక్తజనులుపోవు మార్గము
రామభక్తి


10 కామెంట్‌లు:

  1. 'రద్దీగా నుండనిది రామభక్తి మార్గము'
    నిజం కదూ! ఒక్కడూ తోడు కనపడడు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే నండి. రామా అంటేనే అలా అన్నవాడేదో పాతరాతియుగం వాడన్నట్లు చూసే కాలం కదా.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. sugar industry కి సంబంధించిన లింకు ఎందుకండీ అందులోని రామకీర్తన క్రిందన :)

      తొలగించండి
  3. http://www.tirumalesa.com/amazing-secrets-of-tirumala-temple-revealed-by-head-priest-ramana-deekshithulu/

    రిప్లయితొలగించండి
  4. శ్రీరామ్‌ గారూ,
    మీరు ఇక్కడ వ్యాఖ్యలద్వారా కొన్ని లింకులు ఇచ్చారు. బాగున్నాయి. కాని ఒక్క సందేహం. ఒక టపాక్రింద వ్యాఖ్య అన్నది ఆటపాకు సంబంధించి ఉండటం న్యాయం. అలా ఉండటం సహజంగా ఉంటుంది. ఇక్కడ మీవ్యాఖ్యలు టపాకు సంబంధం లేకుండా ఉన్నాయని నా అభిప్రాయం. ఆనుషంగికంగా వ్యాఖ్యలో ఇతర విషయాలను ప్రస్తావించటమూ కేవలం ఇతరవిషయాలను ప్రస్తావించటం కోసమే టపాకు సంబంధం లేనివిధంగా వ్యాఖ్యను ఉంచటమూ వేరువేరు విషయాలు కదా. అన్యథా భావించవద్దని మనవి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.