పేరుకొన్న యజ్ఞానం బూరకున్న తొలగేనా ఊరకున్న తొలగునదై యున్న దొక్కకాయమే |
|
ఏమయ్య యజ్ఞానం బెల్లరకు సహజమా నాముఖాన ప్రొద్దుపొడిచి నన్ను పట్టుకొన్నదా ఈమాయా జగమునందు సామాన్య మజ్ఞానము సామాన్యమైతే దాని సాగనంపు టేలాగు |
పేరుకొన్న |
సాగనంప దలచితేని యోగమార్గ మున్నది యోగమార్గ మందు నేను సాగిపోవు టేలాగు రాగద్వేషములు విడచి రాము నాశ్రయించుము యోగమందు రక్తి కలుగకున్న నూఱకుండుము |
పేరుకొన్న |
రక్తి లేక కాదు కాని శక్తి చాల దేమో శక్తియుక్తులన్ని రామచంద్రు డిచ్చు నీకు భక్తికలిగి రామదాసభావ మందు నిలచెద యుక్తమైనవిధము రామయోగమందు నిలచుట |
పేరుకొన్న |
4, సెప్టెంబర్ 2016, ఆదివారం
పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.