3, సెప్టెంబర్ 2016, శనివారం

ఊరు పేరు లేని వారు



ఊరూ పేరూ లేని వాడ వొకడవు నీవు
ఊరూ పేరూ లేని వాడ నొకడను నేను

వేల రూపముల నిన్నె వెదకెద నేను
వేల వేషములు నాకు వేసెద వీవు
ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ
వాలాయ మీ ముచ్చట మేలు మేలు
ఊరూ‌ పేరూ

వేల పేర్లు పెట్టెద నేను పేరు లేని నీకు
వేల మార్లు నాకు పేర్లు పెట్టెద వీవు
ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ
వాలాయ మీ ముచ్చట మేలు మేలు
ఊరూ‌ పేరూ

వేల క్షేత్రముల నీదు పెంపుగాంతు నేను
వేల క్షేత్రముల నన్ను పెంపుసేసె దీవు
పోలికల కేమిగాని పురుషోత్తముడవు
ఏలికవు నాకు రామా యిదిగో‌ దాసుడను
ఊరూ‌ పేరూ


2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మిత్రులు శర్మగారూ, ధన్యవాదాలు.
      ఇప్పటి వరకూ చేసిన సంకీర్తనలన్నింటినీ ఒక పేజీగా ఈబ్లాగులో ఉంచుతున్నాను పాఠకులసౌకర్యార్థం. వందకు చేరువలో ఉన్నాయి. రాముడీ దేహానికి శక్తిని యిచ్చినంతకాలమూ రోజున కొకటి చొప్పున వస్తాయని ఆశిస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.