నేనెరిగిన దెల్ల నీకొఱకై
మానక మరిమరి ధ్యానము చేయుట
నేనడిగిన దెల్ల నా కొఱకై
నీ నిజరూపము మరి మరి చూపుట
భ్రమలను విడచిన దేహిని గాను
శమదమంబుల విధులే నెరుగను
అమలిన సహజోదారప్రేమమున
నిముసము విడువక నిను భావింతును
లోకక్రియోపరి నిష్టుత దేనికి
నీకు మెప్పుగా నిలువగ లేనిది
నీకై మనసే ముడుపు గట్టితిని
నా కెరుకగు నటుగా కొలుతును
నను చేసినదీ నీవని యెరుగుదు
నను నడుపునదీ నీవని యెరుగుదు
ననునిను నొకటిగ నాత్మ నెరుగుదు
కనుకనె నిను చూడక నెటులుండుదు
అమ్మో తెలుగులో ఇన్ని క్లిష్టమైన పదాలున్నాయా?
రిప్లయితొలగించండిఅనికేత్,
రిప్లయితొలగించండిమీ పేరులోనే రెండు క్లిష్టమైన పదాలున్నాయి కదా? ఆలోచించండి.
అయినదేమో అయినది. తెలుగు సంస్కృతంతో మమేకం అయింది.
రెండూ సుందరమైన అజంతభాషలే మరి. సరే పై గేయం దగ్గరకు వస్తే అంత క్లిష్టమైన పదాలేవీ ఉన్నాయనుకోను. నిజానికి సాంప్రదాయిక తెలుగుసాహిత్యం అలవాటుగా చదివేవారికి అన్నీ తెలిసిన మాటలే అనుకుంటాను. మీకు అవుసరం అయిన పదాలకు http://www.andhrabharati.com/dictionary/index.php చూడండి.