20, ఏప్రిల్ 2012, శుక్రవారం

మాయల మారి యెవరో మాయనె మాయం చేసిన దెవరో

మాటలు నేర్చిన దెవరో
  మాయలు పన్నిన దెవరో 
మనసున జొరబారి ప్రపంచం
  మాయం చేసిన దెవరో 
మటు మాయం చేసిన దెవరో

పగలంతా నా కనుల ముందర
  వగలను కురిపించీ నటించీ
ఒడలు మరువగా చేసిన దెవరో
  పగలు రేయిగా చేసిన దెవరో

రేయంతా తన స్మరణము లోని
  హాయిని మరగించీ రెప్పలు
మూయగ నీయని దెవరో యెవరో
  రేయి పవలుగా చేసిన దెవరో

అలజడి రేపి రేబవళ్ళను
  తలక్రిందులుగా చేసిన దెవరో
బలె బలె మాయల మారి యెవ్వరో
  మాయనె మాయం చేసిన దెవరో

5 వ్యాఖ్యలు:

  1. బాగుంది అండి...మీ కవిత తో మమ్ములను మీరు కూడా మాయ చేశారు...

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మాయనే మాయం చేయగలిగినిది ఆ పురుషోత్తముడొక్కడే కద!

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.