ఇది నా అద్దమేనా
ఇందులో నీ రూపమే కనబడుతోంది
ఇది నా ప్రపంచమేనా
ఇది నా ప్రపంచమేనా
అన్నిటా నువ్వే నిండి కూర్చున్నావు
ఇది నా మనస్సేనా
ఇది నా మనస్సేనా
ఇప్పుడు నీ మాటే వింటున్నట్లున్నది
ఇది నా జీవితమేనా
మరి నీ యిష్టప్రకారమే నడుస్తున్నట్లుంది
ఇంకా నేనెందుకయ్యా
ఇది నా జీవితమేనా
మరి నీ యిష్టప్రకారమే నడుస్తున్నట్లుంది
ఇంకా నేనెందుకయ్యా
ఇప్పుడు అది కూడా నువ్వేనంటే పోలా
సంతోషం అండీ. కొంచెం మార్పులు చేసాను చూడండి.
రిప్లయితొలగించండిnice feeling.....
రిప్లయితొలగించండిwow.. Chaalaa baagundi.
రిప్లయితొలగించండిగురువుగారు! మీ కవిత చదవటం మొదలుపెట్టినపుడు ..అహా.. బాగుంది, అన్నిటా నీ రూపే, అంతా నువ్వే, నీ మాటే అని చదువుతుండగా హట్టాత్తుగా "ఇంకా నేనెందుకయ్యా ఇప్పుడు అది కూడా నువ్వేనంటే పోలా" అని చదవగానే నవ్వొచ్చేసిందండి!బాగుంది...
రిప్లయితొలగించండిబావుందండి
రిప్లయితొలగించండితాడి గడప వారి తపనలో పరమాత్మ
రిప్లయితొలగించండినిండి యద్ద మందు నిలిచె నేమొ !
రూపు మాట మరియు చూపున నాతడే
యితడి బదులు వచ్చి హితము గూర్చె
కం. లక్కాకుల వారు దయతో
తొలగించండివక్కాణించినది నిజము పరమాత్ముని పై
నిక్కపు ప్రేముడి మాటల
కెక్కొంచుచు నుంటి స్వామి కేరింతలనే
బాగుందండీ....
రిప్లయితొలగించండిచిన్నప్పుడు విన్న తత్వాలు గుర్తుకొచ్చాయి. మీ బ్లాగు ఇదే చూడ్డం, తాత్విక చింతనాధారంగా రాస్తున్నారని నా భావన.
రిప్లయితొలగించండిబాగుందండీ....
రిప్లయితొలగించండికం. చదివిన చదువుచు నుండిన
రిప్లయితొలగించండిముదితాత్ముల కెల్ల తొలుత మ్రొక్కెద స్వామిన్
వదలెక కీర్తించెడు నా
హృదయము మీ మెప్పు నతని కృపగా నెంచున్
శ్యామలీయం వారు,
రిప్లయితొలగించండిఅద్దమూ,రూపమూ, ప్రపంచమూ మొ ఏవీ మనవి కావేమో నండీ !
ఇక నేనెందు కంటారా , మనసో రేతః ప్రథమం యధాసీత్, (వాట్ ఈజ్ దట్ ?)
మీ బ్లాగు లో వర్డ్ వెరిఫికేషన్ మరీ కష్టం గా ఉంది కామెంట డానికి!
చీర్స్
జిలేబి.
చాలా బాగుంది మీ కవిత
రిప్లయితొలగించండి