26, ఏప్రిల్ 2012, గురువారం

నా చేయందుకో మని మనవి

మాయలు చాలించమని మనవి రామ నా   
చేయందుకో మని మనవి రామ

మెలకువతో మాయను గెలువగలుగు నంత
తెలివి నాకు లేదని మనవి నీ
వలన నిలచి యుంటినని మనవి నా
బలము నీవే నని మనవి

తఱుగని చదువులలో తగులువడి నిన్ను నే
నెఱుగుటయే కుదరదని మనవి  నీ
కరుణ యొకటె చాలని మనవి నా
బరువిక నీదే నని మనవి

తడవతడవకు కొత్త తగులముల జిక్కి నే
నిడుములను పడలేనని మనవి నే
బడలితి మన్నించమని మనవి యీ
పుడమి కిక రాలే నని మనవి

7 కామెంట్‌లు:

  1. కవిత అంతా బాగుందండి. ఈ వాక్యాలు మరింత బాగున్నాయండి.

    తరగని చదువులలో తగులుకొని నిన్ను
    యెరుగుటయే కుదరదని మనవి నీ
    కరుణ యొకటె చాలని మనవి నా
    బరువిక నీదేనని మనవి.

    భగవంతుని శరణాగతిలో ఉన్నంత భద్రత భక్తునికి మరెక్కడా ఉండదు కదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *భగవంతుని శరణాగతిలో ఉన్నంత భద్రత భక్తునికి మరెక్కడా ఉండదు కదా *

      భద్రత ఉండోచ్చు. అది భగవంతుని కలవక ముందు ఉంట్టుంది. కలసిన తరువాత భద్రత గురించి ఆలోచించరు.

      SriRam

      తొలగించండి
  2. శరణాగతికి మించినది లేదండీ! గజేంద్రుడేమి చేఏశాడూ? శరణాగతి కదా!!!నీవేతప్ప....

    రిప్లయితొలగించండి
  3. సుందరమైన భావాలూ లలితమైన పదాలు
    ఎక్కడి వీ మధుర రాగాలు ..
    మీ చరణాలు వెంట నడిచినపుడల్లా
    నాలో ఇవే గానాలు , సరాగాలు
    ఎంతో అలరిస్తున్నాయి మీ గీతాలు

    రిప్లయితొలగించండి
  4. బాలకృష్ణారెడ్డిగారు, మీకు యీ గీతాలు నచ్చుతున్నందుకు చాలా సంతోషం.
    వీటిని వెలువరించటంలో నా ప్రతిభ యేమీ లేదు. అంతా ఆయన చిద్విలాసం.

    రిప్లయితొలగించండి
  5. సుదర సుమధుర కవితాకుసుమార్చనలు మీరచనలు, నమస్సులు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.