అనుభవంలోకి వస్తున్నట్లు భ్రమగొలిపే
అందమైన ప్రతి అబధ్ధానికి అమరించిన ముద్దుపేరు
వ్యావహారిక సత్యం
అందమైన అబధ్ధాలన్నింట్లో అతిపెద్దది ప్రపంచమే
అందుకే అది ఒక వ్యావహారిక సత్యం
అనుభవాలకు అంతుచిక్కని అసలు సిసలు తత్వం
అందీ అందని ఆనందానికి అతిసరళ స్వరూపం
పారమార్థిక సత్యం
అలా అంతు చిక్కని అతి చిన్నది నేనే కద
అందుకే నేనే ఒక పారమార్థిక సత్యాన్ని
ఈ రెండు సత్యాల మధ్య తారాడే విభజన రేఖలని
అప్పుడప్పడు నీవు గీస్తున్నావని యెప్పుడూ పొరబడుతున్నానే
ఆ గీసేది నేనేనని చెప్పవేం
అయితే ఈ గీతలు నేనే హాయిగా చెరిపేస్తాను
అప్పుడింక యేకరూప సత్యమేగా ఆపైన మిగిలేది
అదంటే నువ్వేకదా
నాకంటూ వేరే ఉనికి లేకపోవటమే నా కోరిక
నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక
అందమైన ప్రతి అబధ్ధానికి అమరించిన ముద్దుపేరు
వ్యావహారిక సత్యం
అందమైన అబధ్ధాలన్నింట్లో అతిపెద్దది ప్రపంచమే
అందుకే అది ఒక వ్యావహారిక సత్యం
అనుభవాలకు అంతుచిక్కని అసలు సిసలు తత్వం
అందీ అందని ఆనందానికి అతిసరళ స్వరూపం
పారమార్థిక సత్యం
అలా అంతు చిక్కని అతి చిన్నది నేనే కద
అందుకే నేనే ఒక పారమార్థిక సత్యాన్ని
ఈ రెండు సత్యాల మధ్య తారాడే విభజన రేఖలని
అప్పుడప్పడు నీవు గీస్తున్నావని యెప్పుడూ పొరబడుతున్నానే
ఆ గీసేది నేనేనని చెప్పవేం
అయితే ఈ గీతలు నేనే హాయిగా చెరిపేస్తాను
అప్పుడింక యేకరూప సత్యమేగా ఆపైన మిగిలేది
అదంటే నువ్వేకదా
నాకంటూ వేరే ఉనికి లేకపోవటమే నా కోరిక
నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక
అదేంటండి ఇంత అందమైన గీతల్ని చెరిపేయాలంటారు??? :-)
రిప్లయితొలగించండిపద్మార్పితగారు
రిప్లయితొలగించండిస్వాగతం.
ఎంత అందమైన గీతలయినా అవి 'నేను' అనే అహమిక కారణాన 'జీవుడు' గీసుకున్నవే. వాటి వల్ల విభజితమౌతున్నది తన స్వస్వరూపావబోధమే అని స్పృహ కలిగినపుడు తన చిన్నపిల్లవాడీ చేష్టలాంటి 'ఆట'కు తానే నవ్వుకుని 'ఆట'ను పరి సమాప్తం చేస్తాడు కద.
వడ్దాది సుబ్బారాయకవిగారి భక్త చింతామణీ శతకంలోని పద్యం చిత్తగించండి!
పడతుల్ వేడుక బొమ్మరిం డ్లిసుకలో బాగొప్ప నిర్మించి చొ
ప్పడ ముగ్గుల్ పచరించి ఆడుకొని ఆపై ఆట కొల్లంచు క
ట్టడముల్ పాడొనరించి పోవుగతి నీకు ఈ విశ్వముల్
పొడమం జేసి భరించి మాపుటలు ఎప్డున్ భక్త చింతామణీ.
చిన్న తనంలో ఇసుకలో అమ్మాయిలు (ఆ మాటకు వస్తే అబ్బాయిలూనూ) రకరకాల ఇళ్ళు నిర్మించి కేరింతలు కొడుతూ ఆడుకుంటారు. చాలా సేపు ఆడుకొని ఇంటి ధ్యాస రాగానే అవన్నీ తుళ్ళుతూనే పడగొట్టేసి అలాగే నవ్వుకుంటూ యిళ్ళకు వెళ్ళి పోతారు. ఏమీ బాధపడరు కదా!
అలాగే మనమూ రకరకాల విభజనలతో మన సత్యస్వరూపాన్ని మనమే దూరం చేసుకుంటున్నామని తెలియగానే - మాయ విడి పోతుంది - అన్నీ హాయిగా వదలి స్వస్వరూపంలో ఆనందంగా ఉంటాం.
అంతే సంగతి.
Thanks for practical clarification Sir...
తొలగించండిచాలా బాగా చెప్పారండి . నేను అన్న అహం వీడిననాడు మనకు దుఖం
రిప్లయితొలగించండిఅనేది అసలు ఉండదు.ఆశించడం ఉండదు. ఇలాగే జరగాలి అని మనం అనుకోము. ఏదీ జరిగినా అంతా మని మంచికే అనుకుంటాము.
బాగుంది మీ వేదాంతం, ఆచరణాసాధ్యం :)
రిప్లయితొలగించండితిరశ్చీనో వితతో రశ్మి రేషామ్!
రిప్లయితొలగించండిఅధః స్విదాశీత్ ఉపరిస్విదాశీత్ ?
చీర్స్
జిలేబి.
లీలగ 'గీతల చెరిపే
రిప్లయితొలగించండియాలిక' యను మాట లోనె 'యహమిక' లేదా ?
మీలోన 'పారమార్థిక '
యాలోచన నిడిన వాడె యన్నియు జెరుపున్ .
బ్లాగు సుజన-సృజన
లక్కాకులవారు మంచి పట్టే పట్టారు. అహమిక ప్రాకృతికమైనది కదా వదల్చుకోవటం అనుకున్నంత సులభం యేమీ కాదు. కాని శుభసంకల్పం అహమిక క్రిందికి రాదు. మోక్షభూమికలలో మొదటిది శుభేఛ్ఛ కదా! కోరికలను నశింపజేయాలని ఆశించటమూ ఒక కోరికేనని paradoxical గా తోస్తుంది. శుభేఛ్ఛ కాబట్టి, అది లౌకిక మైన కోరిక కాదు కాబట్టి, బంధకారణం కాదు. అందు చేత దోషం లేదు.
తొలగించండిచిక్కని "జీవ"గానం. ఇంత లోతుగా కాదు గానీ, మునుపట్లో రాసుకున్న పాదం ఒకటి ఇక్కడ పెడుతున్నాను - జీవ పరమాత్ముల లెక్కలు ఆధారంగా నా ఊహ ఇది.
రిప్లయితొలగించండి"నీవు కేంద్రబిందువునన్నావు
నీ చుట్టూ ఓ అనంతవృత్తం
నను గీసుకు రమ్మన్నావు
ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెప్తున్నాను, వింటావా?
అమూర్త భావనవి, బిందువువీ నీవు
నిన్నూ నన్నూ కలిపే రేఖ ఓ సరళసమీకరణం,
నువు కేంద్రంగా గీసే వృత్తం అదొక వర్గసమీకరణం
నా మనసే సంకేతంగా ఇది నా బీజగణితం, తెలిసిందా?"
(వర్డ్ వెరిఫికేషన్ వీలైతే తీసేయండి)
ఉషగారూ, మీ తాత్విక చింతన అలరించింది. గోవిందుడిని గణితాని కెక్కించారు - భలే!
తొలగించండి