కొత్త కొత్తలు నీవు కోరేవు యెక్కడి నుండి
యెత్తుకు వచ్చేదయ్యా యెరిగించ వయ్యా
అలిగి కూర్చుండేవు అది మరియాద కాదు
అడిగిన వన్నీ నీకు నమరించ లేదా
యెత్తుకు వచ్చేదయ్యా యెరిగించ వయ్యా
అలిగి కూర్చుండేవు అది మరియాద కాదు
అడిగిన వన్నీ నీకు నమరించ లేదా
వలపులు కొత్తవి గావు వగపులు కొత్తవి గావు
కొలుపులు కొత్తవి గావు ముడుపులు కొత్తవి గావు
కొలుపులు కొత్తవి గావు ముడుపులు కొత్తవి గావు
తలపులు కొత్తవి గావు తమకము కొత్తది గాదు
నగవులు కొత్తవి గావు తగవులు కొత్తవి గావు
నగవులు కొత్తవి గావు తగవులు కొత్తవి గావు
మచ్చరాలు పగలున్నాయవి మన కెందుకు లేవయ్యా
ఏవీ కొత్తవి కానప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు
రిప్లయితొలగించండిఎక్కడి నుండి తెస్తారు కొత్త కొత్త సంగతులు
ఎంత కొత్తగా ఎంత మెత్తగా రాసారండి ఈ గేయం .
కందుకూరి జనార్దనాష్టకం గాని చదివారా ఏమిటి
గొప్పగా ఉంది .చదువుతుంటే హాయి హాయిగా ఉంది
బాలకృష్ణా రెడ్డి గారూ, సుస్వాగతం.
రిప్లయితొలగించండిమీకు నా పాట నచ్చి నందుకు చాలా సంతోషం.
కందుకూరి జనార్దనాష్టకం సంపాదించి చదువుతానండీ.
ధన్యవాదాలు.
చాలా బాగుందండీ! పాత వాటినే కొత్తగా చూపిస్తే సరి :)
రిప్లయితొలగించండిరసజ్ఞగారూ ధన్యవాదాలండీ. సర్వము తానయైన వానికి మనం కొత్తగా ఇవ్వగలిగినదేమీ ఉండనే ఉండదు కదా! నిజం.
తొలగించండిరసజ్ఞగారి ఇడియా బాగున్నట్లుందండి..:-)
రిప్లయితొలగించండిJust kidding...Good one sir.
కసిదీర యలిగి కొందఱు ,
రిప్లయితొలగించండిరస సరసిని ముంచి కొంద , ఱమలిన భక్తిన్
పసజూపి కొంద ఱాతని
వశ పరచు కొనిరి - వివేక వంతులు 'మీరున్'
రాజారావుగారూ, ధన్యవాదాలు.
తొలగించండిబాగుందండి!
రిప్లయితొలగించండికొత్తగా
రిప్లయితొలగించండిమెత్తగా
హత్తుకుంది మనసుకు...
బాగుందండి.
@శ్రీ
వెన్నెలగారూ, శ్రీగారూ
రిప్లయితొలగించండిమీకు నచ్చినందుకు చాలా సంతోషం
తెలుగులో ఇలా metaphysical poetryకి మంచి ఆదరణ వస్తున్నందుకు ఆనందంగా ఉంది.