ఏమన్నా అనుకోనీ ఎవరైనా నీకేమీ
రామన్నే నీతోడై రాగా యిక భయమేమీ
ఏవేవో మాట్లాడే యీలోకం నినుగూర్చి
ఈవే ళేనిందలనో ఎన్నైనా వేస్తున్నా
వావిడచి దుఃఖించగ పనియేమీ లేదోయీ
ఆవెర్రుల ప్రేలాపన లాకర్ణించకు మోయీ
తప్పెంచిన దీలోకం తల్లిని సీతమ్మోరిని
తప్పెంచిన దీలోకం తండ్రిని మన రామయ్యను
తప్పెంచిన లోకాన్నే మెప్పించిన రామయ్యను
మెప్పించిన నినుజూచి నీతప్పుల నేయెంచుచు