తన్ను తా నెఱిగిన ధన్యాత్ము డెవ్వడో తిన్నగా వాడె పో నిన్నెఱుగు రామ |
||
ఎన్ని జన్మము లెత్తి యెంతలోకము జూచి యున్న గాని మన్ను మిన్నుల మధ్యలో నున్నవాడై జీవు డున్నవా డున్నట్లులె యున్నాడయా ప్రకృతి నూయల లూగుచు |
తన్ను | |
ఎందుండి తా వచ్చె నెన్ని మారులు వచ్చె నెందుల కిట నుండె నెందు బోవగ నుండె నిందు తన్నుంచిన దెవరన్న జిజ్ఞాస పొందిన జీవునకు పొటమరించు నెఱుక |
తన్ను | |
క్రమముగా ప్రకృతిని గడచు నా జీవుడు క్రమముగా తన్నెఱుగ గలుగు నా జీవుడు క్రమముగా నిన్నెఱుగ గలుగు నా జీవుడు క్రమముగా నీలోన గలయు నా జీవుడు |
తన్ను | |
11, ఏప్రిల్ 2016, సోమవారం
తిన్నగా వాడె పో నిన్నెఱుగు నీశ్వర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)