నవమాలిని. ఇనకుల నాయకా యితరు లేలా నను నిను కన్నుగానకను తిట్టన్ దనుజుల పైన నాదరము ధర్మం బన నగు నట్టి వీ రసురు లేమో |
నవమాలినీ వృత్తం
ఈ నవమాలినీ వృత్తానికి గణవిభజన న - జ - భ - య. యతిస్థానం 8వ అక్షరం. వృత్తానికి ప్రాసనియమం ఉంటుంది.
ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.
పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
దీని నడక చూస్తే ఇల్లా ఉంది:
ఇనకుల - నాయకా - యితరు - లేలా
నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
దనుజుల - పైన నా - దరము - ధర్మం
బన నగు - నట్టి వీ - రసురు -లేమో
వేరే నడకలతో ఈ వృత్తంలో పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.