శరణు జొచ్చితిని నిన్నే హరేరామ హరేరామ
మరి భయములు బాపరా హరేరామ హరేరామ
గురువు యాగమును గాచిన హరేరామ హరేరామ
హరునిచాపమును విరిచిన హరేరామ హరేరామ
తరుణిశాపమును బాపిన హరేరామ హరేరామ
సురవిరోధులను గూల్చిన హరేరామ హరేరామ
సరసుడవని చాల వింటి హరేరామ హరేరామ
వరదుడవని చాల వింటి హరేరామ హరేరామ
పరాత్పురుడవని వింటిని హరేరామ హరేరామ
పరమభక్తి నినుజేరితి హరేరామ హరేరామ
నరపాలకశేఖరుడవు హరేరామ హరేరామ
కరుణగలుగు వాడవనుచు హరేరామ హరేరామ
తరచుగ వినుచుందునురా హరేరామ హరేరామ
తరుణమిదే దయజూపగ హరేరామ హరేరామ
ఈ కీర్తనలో ప్రతిపంక్తిలోనూ హరేరామ హరేరామ అని పునరావృతం అవుతూ వస్తుంది. ఇలా ప్రతిపంక్తినోనూ నాలుగుసార్లు హరినామస్మరణం చేయటం వలన కీర్తన మొత్తం పదునాలుగు పంక్తులకూ వెరసి యాభైయారు సార్లు నామస్మరణం చేసినట్లు అవుతుంది. విస్తరించి పాడటం ద్వారా అది యెంతైనా కావచ్చును. పంక్తులన్నీ రెండుసార్లు పాడబడితే అష్టోత్తరశతనామస్మరణం అవుతుంది. ఎవరి ఆసక్తికొలదీ వారు ఎంతైనా విస్తరించుకొని గానం చేసుకొనవచ్చును.
రిప్లయితొలగించండి