ఉర్విని గల వారికెల్ల నున్నది యొక రక్ష
సర్వవేళ లందు నదే సాగించును రక్ష
అంతగొప్ప రక్ష యున్న నది యేదో తెలుపుమా
వింత కదా యట్టి సర్వవిధముల రక్ష
అంతకన్న గొప్పరక్ష యనగ నెందును లేదు
వింతలేదు రామరక్ష విశ్వమంతటికి రక్ష
ఆరుగురు శత్రువులను తీరుగ నది యణచునా
మారునితో కట్టగట్టి వారి నణచును
దారుణభవవారిధి నది దాటించ జాలునా
తారక మారామరక్ష తప్ప వేరొకటి లేదు
కాలు డనే వాడొకడు కబళించ వచ్చినపుడు
చాలినంత రక్ష నది సలుపజాలు నందువు
కాలుడెవడు గీలుడెవడు కబళించ వాడెవడు
రాలేడు నీదరికి శ్రీరామరక్ష నీకుండ
శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇపుడు పునరావృత్తం అయింది.
రిప్లయితొలగించండినన్నయితే రాముడు అనేకమార్లు గండాలనుండి రక్షించిన మాట వాస్తవం. రాముడికి రక్షించటమే పని అనుకోండి.
తొలగించండి