ఈవిలయము నుండి జనుల నెవరు రక్షింతురో
నీవు తక్క నిక్కముగ నీరజాక్ష
మూడులోకములను ముప్పుగా మారిన
పాడురావణుని పనిపట్టిన రామా
నేడు నీవిట్లు చూచిచూడనట్లున్నావు
వేడుకొందు కరోనా పీడనణచరా
ఆరని చితిమంటలును హాహాకారములును
ఘోరమైన దృశ్యములకు గుండెలదరగ
వీరుడా నీవేలిన భారతావని యిది
యీరీతిగ బావురుమను టెట్టులోర్తువు
నీరాజ్యము నీప్రజలు నీభక్తులు నీవారు
ఈరోజున నీరక్షణ కోరుచున్నారు
రారా వేవేగ బ్రోవ రామచంద్ర రఘువర
శ్రీరామరక్ష కలుగజేయర మాకు
శ్రీరామూవాచ:
రిప్లయితొలగించండినా జేతి నేమున్నది శ్యామ
చేజేతుల యిది మానవ తప్పిదం కాదా
ప్రకృతి ని వికృతి జేయగల పటిమ జనులకి రానిదా
నా జేతి నేమున్నది శ్యామ
అవతారమున నే సైతం నానా కష్టాలను జూచితినే
నీవు యెరుగ జాలవా యేమి సీత యెడబాటు దుఃఖం
నా జేతి నేమున్నది శ్యామ
మాస్కులేకుండ సంచరిస్తు ఒహటికి పదిమంది
యిలా తమకు తాముగా యపాయమును దెచ్చుకునే వేళ
నా జేతి నేమున్నది శ్యామ
రోగ నిరోధకాభివృద్ధి గాంచి శానిటైజర్ జేతబూని
యుద్ధము గావింపటం తరువాయి ఆరోగ్యమే హితవు కూర్చగా
శ్యామలీయం సర్.. క్షంతవ్యుణ్ణి.. ఎంత మొత్తుకున్న కనీ తగు జాగ్రతలు కూడా పాటించని వారి పట్ల మీ రీతి ననుసరించి చిన్న చురక..
అందరు ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీరాముని వేడుకుంటు
~శ్రీత ధరణి
మా అత్త మామలున్నారు.. వారికి ఇలా ఉంది పరిస్థితి అంటే.. "వచ్చాక చూసుకోవచ్చులే, అయినా వ్యాక్సిన్ చేయించుకున్నాక రాదు.. మా పల్లేటూళ్ళలో లేనే లేదు.. అనవసరంగా హడలెత్తించకు" అంటారు. నేను మాస్క్ వేసుకునే ఉంటానా అపుడు "జనాలు నవ్వుతున్నారు.. ఎందుకా బుట్ట" అంటు హేళన చేస్తారు. అతను ఆర్టీసి లో శ్రామిక్ అంటే ఖళాసి కింద వర్కర్ అనట్టు.. నేను మాత్రం ఎపటికపుడు జాగ్రత వహిస్తూనే ఉంటాను. పైగా నా శ్రీమతి కూడా "లోకంలో నీకే వచ్చేస్తునట్టు ఎందుకంత నెగెటివిటి.. మా ఊళ్ళో ఎవరూ మాస్క్ వేసుకోరు, వాళ్ళు బానే ఉన్నారు కదా.. పైగా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇంక కరోనా అంటున్నావంటు గేలి చేస్తా ఉంటుంది. వారందరికి తెలియనిది, నాకు, మా పేరెంట్స్ కు తెలిసింది ఎమిటంటే.. ఇది నిజంగానే కొరలు చాచే రక్కసని, ఎదో టీక తో అంతమొందించలేమని, సరైన ఔషధం అనేది ఇపుడపుడే రాదని.. ఇపుడున్న జాగ్రతలతో మరియు టికాల తంతు కేవలం తాత్కాలికమని. వెర్షన్ ౨ ఉధృతి చాలా ఘోరంగా ఉందనేది కాదనలేని సత్యం, శ్యామల్ రావు గారు. మీరందరు కూడా తగు జాగ్రతలు పాటిస్తు ఈ మహమ్మారి నుండి త్వరిత ఉపశమనానికై కాలచక్రభ్రమణ కై ఎదురీదాలి.
రిప్లయితొలగించండిజాగ్రతలు పాటిస్తున్నామండీ. మా వాళ్ళ కుటుంబాలు కూడా కొన్ని కరోనాకు చిక్కి క్షేమంగా బయటపడ్డాయి. ఐనా మీరన్నట్లు అక్కడక్కడా నిర్లక్ష్యపు మనుష్యులు తగులుతూనే ఉంటారు! అదే చాలా హడలుగా ఉంది. ఈమధ్యనే మాచెల్లెలు గారు ఒకామె ఇంట్లో శుభకార్యం ఒకటి జరిగింది. కరోనాభయం వలన రాలేం అంటే, అన్ని కుటుంబాలకూ మీరు పెద్దలు కదా రాకుంటే ఎలా అని ఒత్తిడి. నిజానికి ఈభయం కారణంగా కాకపోతే తప్పనిసరిగా వెళ్ళమా? చివరకు ఒత్తిడి కారణంగానూ మాకు కూడా మనసుపీకటం కారణంగానూ అన్నిజాగ్రతలూ తీసుకుంటూ వెళ్ళాం. అక్కడ అందరూ జాగ్రతలు వహించారు అని సంతోషిస్తుండగా ఒకామె మాస్క్ వేసుకోలేదు. ఎందుకలా అంటే ఆవిడకు అది చిరాకట. అందుకని తాను వేసుకోదట. చాలు కదా? ఏం చెప్పాలీ అటువంటి వారికి? మా తమ్ముడొకతడికి ఇద్దరూ చిన్నపిల్లలు. కాబట్టి వాళ్ళు చాలాకాలం నుండి ఇల్లుదాటి బయటకే రావటం లేదు. ఐనా ఇంటిల్లిపాదికీ ఈకరోనా సోకింది. ఇప్పుడు అందరికీ తగ్గింది లెండి. గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నాం మరి.
తొలగించండిమాకు కూడా ఇద్దరు చిన్న పిల్లలు. అంచేతనే బయటకు వెళ్ళకండని మొత్తుకుంటు ఉంటా.. ఐతే మా అత్త గారు మాత్రం నెల కు రెండు మార్లు ఏ సరంజామ లేకుండానే విచ్చేస్తూ ఉంటారు. అదొక భయం.. ఐనా ఎవరి జాగ్రతలో వారు ఉండాలి మీరనట్టు, ఒకసారి లంకె తెగిందా ఇహ అంతే సంగతులు..
తొలగించండిధన్యవాదాలు శ్యామల్ రావు గారు.. మీ అనుభవాలు పంచుకున్నందుకు.. అందరు క్షేమంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటు..
జై శ్రీమన్నారాయణ