హాయి రామభక్తి మాకు తాయిలా లెందుకని
మాయలకు లొంగరు మహిని రామభక్తులు
తాయిలాలిచ్చి ఓట్లు దండుకోగల రేమో
తాయిలాలిచ్చి పదవి దండుకో గలరేమో
తాయిలాలిచ్చి హరి దాసులను కొనలేరు
హాయి రామభక్తి యని హరిదాసు లుందురు
తాయిలాలిచ్చి తప్పులు దాచిపెట్ట గలరేమో
తాయిలాలిచ్చి సతుల మాయచేయగల రేమో
తాయిలాలిచ్చి హరి దయను మీరు కొనలేరు
హాయిగా రామభక్తి యందించును హరిదయ
తాయిలాలిచ్చి సభల దర్జా చాటగల రేమో
తాయిలాలిచ్చి దండధరుని మీరు కొనలేరు
తాయిలాలిచ్చి మోక్షద్వారమును చొరలేరు
హాయిగా రామభక్తి యందించును మోక్షము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.