4, ఏప్రిల్ 2021, ఆదివారం

రామా రామా రామా యనరాద టయ్యా

రామా రామా రామా యనరాద టయ్యా ఈ
రాముడు నావా డనరాద టయ్యా

రాముడే రక్షకు డనరాద టయ్యా ఈ
రాముడే నాతో డనరాద టయ్యా
రాముడే పోషకు డనరాద టయ్యా ఈ
రాముడే జీవన మనరాద టయ్యా

రాముడే కేశవు డనరాద టయ్యా ఈ
రాముడే శంకరు డనరాద టయ్యా
రాముడే గణపతి యనరాద టయ్యా ఈ
రాముడే బ్రహ్మం బనరాద టయ్యా

రాముడే వరదుం డనరాద టయ్యా ఈ
రాముడే మోక్షదు డనరాద టయ్యా
రాముడే జనకుం డనరాద టయ్యా ఈ
రాముడే దిక్కన రాదటయ్యా


1 కామెంట్‌:

  1. నువ్వు రామ కీర్తనలు వ్రాయడానికి పుట్టినట్టున్నావు
    .ఆ రామ భక్తిడిగా నీ వంతు కృషి అమోఘం. బాగా వ్రాసావు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.