6, మార్చి 2020, శుక్రవారం
వీని పేరు రాముడు వీడు నా దేవుడు
వీని పేరు రాముడు వీడు నా దేవుడు
తానే నా చేయు పట్టి దయచూపెను
అంతులేని భవజలధి యందున్న వాడను
చింతలపాలైన వాడ స్నేహితులార
యెంతో దయచూపి వేగ నిచ్చె కైదోడు నాకు
వింత గాదె మున్ను సేవింపని నన్ను గాచె
వచ్చి చేయిచ్చి మృదు వచనంబుల నాడి
మెచ్చి తన నామ మంత్ర మిచ్చెనండి
అచ్చముగ నవ్యాజమౌ నట్టి కారుణ్యము కాక
ముచ్చటగా చేరదీయ వచ్చుట నేమందుము
ఎన్ని జన్మముల బంధమిది యెట్లెఱుగుదు
నన్నియు బాగుగ నెఱుగు నతడొక్కడే
విన్నాడా రామదేవు డున్నాడు నావాడని
యెన్నడును దండధరుడు నన్ను జూడ రాడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈయన పేరు శ్యామలీయం. ఈయనాతని భక్తుడు. ఇది కన్ఫర్మ్!☺️
రిప్లయితొలగించండిదండధరుడు దెలియదు , కో
రిప్లయితొలగించండిదండధరుని విని , చదివి గదాధరుడని , బ్ర
హ్మాండమునిండారా తా
నుండుననెడు నమ్మకమున నొగ్గెద కరముల్ .