18, మార్చి 2020, బుధవారం

భావించ వలయును పరమపూరుషునిభావించ వలయును పరమపూరుషు నొరుల

భావించి సాధించు ప్రయోజనము లేదుపలుమాట లెందులకు పరమపురుషు రాముని

తలపులలో నుంచుకొన్న తనకు చాలదా

తలపులు భోగాశల తగుల దుర్జనులను

కొలిచి యాపదలలో కూరుకు పోనేలపలుచేత లెందులకు  పరమపురుషు రాముని

అలయక సేవించుకొన్న నదియె చాలదా

పలుగాకులను గొల్చి పనులు వారికి జేసి

కలతపడుచు జన్మచక్రమమున నుండనేలపలుజన్మ లెందులకు  పరమపురుషు రాముని

వలచి జీవించితే భవము లుడుగవా

సులభుని విడనాడి పురే క్షుద్రులభావించి

కలగుచు పలుయోనుల కలిగి మలగ నేల


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.