26, మార్చి 2020, గురువారం

ధనుర్వేదమే యౌపోసనము పట్టినావు


ధనుర్వేదమే  యౌపోసనము పట్టినావు

నిను మించిన వాడు లే డన మించినావువిల్లుచేత బట్టితివి విపినములు చేరితివి

చిల్లరరాకాసుల చెండాడి నిలచితివి

చల్లగా విశ్వామిత్రు సవనమును కాచితివి

నల్లవాడ కౌసల్యానందనా దాశరథిపెద్దవిల్లు విఱచితివి పెండ్లిపీట లెక్కితివి

పెద్దకనుల జానకికి పెనిమిటి వీవైతివి

సద్దుచేయు జామదగ్ని సందడి నణచితివి

ముద్దు కుఱ్ఱడా ఓ మోహనాకారుడాఘన విష్ణుకోదండమున రాక్షసాళిని

మొనలనేసి కైకసి పుత్రుని జంపితివి

వనజసంభవుడు శివుడు వచ్చి నిన్ను పొగడగ

ఘనతకెక్కి నావో కమలాయతాక్షుడా


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.