రండి రండి మనగడపకు
రాములవా రొచ్చారు
వెండిచెంబులతో నీళ్ళు
తెండి కాళ్ళు కడుగుదము
సీతమ్మ మనయమ్మ శ్రీరాములతో కూడ
ప్రీతితో మనయింటికి విచ్చేసెను చూడండి
ఈ తల్లిదండ్రులకు యిచ్చి యర్గ్యపాద్యములు
చేతులార పూజింతము చెంగున రండి
అన్నవెంట లచ్చుమన్న యరుదెంచెను చూడండి
అన్నగారి కుడిభుజం బందురుగా యతడిని
వెన్నంటి దేవుళ్ళను వేడుకతో మారుతియును
తిన్నగా యిదే వచ్చుచున్నాడు మనయింటికి
చూడ రున్నవాళ్ళా యని సుజనులైన చాలునని
వేడుకతో మనయింటికి విచ్చేసిరి దేవుళ్ళు
నేడు మనభాగ్యంబులు నిశ్చయముగ పండెనుగా
మూడులోకముల నేలువాడే విచ్చేయుటచే