8, ఏప్రిల్ 2026, బుధవారం

భయమెందుకురా

భయమెందుకురా భయమెందుకురా

  భగవంతుడు లేడా

జయమంగళకారకుడై రాముడు

  సహాయముగ రాడా


నిరుపణసద్గుణశీలుడు రాముని

  నిర్మలచరితము వినలేదా

కరుణామయుడగు శ్రీరఘురాముని

  ఘనతను చక్కగ వినలేదా

పరమోదారుడు జానకిరాముడు

  పరమసులభుడని వినలేదా

శరణార్ధులను విడువక రాముడు

  చక్కగ కాచుట వినలేదా


శరణమన్న సుగ్రీవుని రాముడు

  చక్కగ కాచుట వినలేదా

శరణమంబను విభీషణు రాజుగ

  హరి చేసెనని వినలేదా

శరణంబను కాకసురు రాముడు

  కాపాడినది వినలేదా

శరణంబన పామరుడ వైన నిను

  సాకక రాముడు విడిచేనా