హరే హరే సంసారనివారణ
శరణాగతజనసంపోషణచణ
శ్రీరఘురామ హరే గోవింద సీతారామ హరే
నారదవినుత హరే గోవింద నారాయణ నృహరే
దేవాధిదేవ హరే గోవింద దివ్యప్రభావ హరే
పావననామ హరే గోవింద పట్టాభిరామ హరే
కోదండరామ హరే గోవింద కువలయనేత్ర హరే
వేదాంతవేద్య హరే గోవింద వీరాధివీర హరే
అనాథనాథ హరే గోవింద అనింద్యకీర్తి హరే
వినాశహీన హరే గోవింద విమలచరిత్ర హరే
దశరథపుత్ర హరే గోవింద దయామృతాబ్ధి హరే
దశముఖనాశ హరే గోవింద ధర్మస్వరూప హరే
పాపవినాశ హరే గోవింద భవభయనాశ హరే
గోపాలదేవ హరే గోవింద కువలయనేత్ర హరే