1, ఫిబ్రవరి 2026, ఆదివారం

శరణుజొచ్చితి

శరణుజొచ్చితిని రామా శరణుజొచ్చితి
పురుషోత్తమ నిన్నే శరణుజొచ్చితి

కరవరదుడ వగు నిన్ను శరణుజొచ్చితి
వరదాయక నిన్నే శరణుజొచ్చితి
శరణాగతత్రాణ బిరుదాంకితుడ వీవు
శరణమీయవో యెవని శరణుజొత్తును

పురహరనుత నిన్ను శరణుజొచ్చితి
పరమాత్మ నిన్నే శరణుజొచ్చితి
నిరుపమాన విక్రమ శరణుజొచ్చితి
ధరాసుతాపతి నిను శరణుజొచ్చితి

కరుణాలవాల నిన్ను శరణుజొచ్చితి
నరసింహా నిన్నే శరణుజొచ్చితి
పరమేశ్వరుడ వీవు శరణంబు నీయవో
మరి యెవ్వరి నిప్పుడు శరణుజొత్తును