తీరుతీరుగ నీదు పేరు పలుకుట కన్న
వేరేమి కోరేము శ్రీరాముడా
శ్రీరామచంద్రుడా జిహ్వాగ్రమందుండ
కోరేము నీదివ్యనామమే వేరేమి కోరేము వేయి జన్మలకైన
నీ రమ్యనామమే కోరేము
సీతామనోహరా జీవలోకేశ్వరా
ప్రీతితో నీదివ్యనామమే
వాతాత్మజాదులకు ప్రాణమై చెలువొందు
భాతి మాకుండుటను కోరేము
భువననాయక రామ రవికులాంబుధిసోమ
భవవార్ధి దాటగా దలచేము
వివరింప మోక్షమే వేడుచు నీపేరు
సవినయంబుగ బలుక గోరేము