అర్థకళ. నిరవద్యగుణాభరణా సురసేవిత శ్రీచరణా ధరణీతనయారమణా విరతాఖిలదైత్యగణా |
ఈ చిన్నారి వృత్తానికి పాదానికి గణాలు స - స - స. అంటే పాదానికి మూడు స-గణాలు. యతిస్థానం లేదు. పైర పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.
ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.
జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.