13, నవంబర్ 2015, శుక్రవారం

వాక్సమర్పణం







      శా. ఈ వాగింద్రియ మింక నీవశము
            గావింపం బ్రయత్నింతు నా
      భావం బంందున నిల్చి నీవు దయతో
            పాలించి యీ సద్వ్రతం
      బే విఘ్నంబులు గిఘ్నముల్ కొనుచు
            పోనీకుండ రక్షించవే
      నీ వాడన్ రఘురామ నమ్మితిని
            నిన్నే నన్ను మన్నింపవే